బిజెపిని పెద్దగా పట్టించుకోని హైదరాబాద్ వాసులు..?

Advertisement

by Xappie Desk | August 13, 2019 14:09 IST
Follow Xappie
బిజెపిని పెద్దగా పట్టించుకోని హైదరాబాద్ వాసులు..?

బిజెపిని పెద్దగా పట్టించుకోని హైదరాబాద్ వాసులు..?
 
ఇటీవల రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక బిజెపి పార్టీ చాలా దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ దేశంలో తన మార్క్ పాలన అందరికీ చూపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలని ఇప్పటికే ప్రయత్నాలు జరిపిన బిజెపి పార్టీని హైదరాబాద్ వాసులు బిజెపి పార్టీ ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో పార్టీ సభ్యత్వం లో హైదరాబాద్ నగరంలో బిజెపి పార్టీ వెనుకబడిపోవడం ఇప్పుడు బిజెపి పార్టీకి ఇబ్బందిగా ఉంది.బిజెపి హైదరాబాద్ పై చాలా ఆశలు పెంచుకుంది. కనీసం ఐదు లక్షల మందిని సభ్యులుగా చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం రెండు లక్షల మంది మాత్రమే సబ్యులుగా చేరారు.దాంతో వార్డు పార్టీ నేతలను సమావేశ పరచి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వీరిలో కొందరు ఇంతవరకు బిజెపి సభ్యత్వానికి సంబందించిన యాప్ కూడా డౌన్ లోడ్ చేసుకోలేదని తెలియవచ్చింది.జిల్లాలలో కాస్త పర్వాలేదని, పది లక్షల వరకు సభ్యత్వం కాగా, హైదరాబాద్ నగరంలో మరీ వీక్ గా ఉందని చెబుతున్నారు. తెలంగాణలో 18 లక్షల సభ్యత్వం చేయాలని పార్టీ అద్యక్షుడు అమిత్ షా నిర్దేశించారు.


Advertisement


Advertisement

Top