టీడీపీలో ప్రముఖ కుటుంబం వైసీపీలోకి..?

Advertisement

by Xappie Desk | January 16, 2019 11:58 IST
Follow Xappie
టీడీపీలో ప్రముఖ కుటుంబం వైసీపీలోకి..?

తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబం తర్వాత నారా కుటుంబం ఆ తర్వాత చెప్పుకోతగ్గది తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండేది దగ్గుబాటి కుటుంబం అంటారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి ప్రస్తుతం రాజకీయాలలో ఉంటూ భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆంధ్రా లో ఎన్నికలు వస్తున్న క్రమంలో నా భర్త ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబం వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి రావచ్చన్న వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. దగ్గుబాటి కుమారుడు హితేష్ పర్చూరు నుంచి అసెంబ్లీ కి పోటీచేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని కదనాలు చెబుతున్నాయి. కాగా కేంద్ర మాజీ మంత్రి ,ప్రస్తుతం బిజెపిలో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురందేశ్వరి కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి వస్తారా?రారా అన్నది చర్చనీయాంశంగా ఉందని ఒక ఆంగ్ల పత్రిక వార్త ఇచ్చింది. ఆమె వైసిపిలోకి వస్తే సగౌరవంగా ఆహ్వానిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని ఆ కధనం చెబుతోంది. వెంకటేశ్వరరావు చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వెంకటేశ్వరరావు రాజకీయాలలోకి నేరుగా రాకపోయినా,కుమారుడికి అండగా ఉంటారని భావిస్తున్నారు. ఒకవేళ హితేష్ కు సాంకేతికంగా ఏమైనా ఇబ్బంది వస్తే వెంకటేశ్వరరావు రంగ ప్రవేశం చేయవచ్చని మరో కధనం. అలాగే పురందేశ్వరి వైసిపిలోకి వస్తే కోస్తా నుంచి లోక్ సభ కు పోటీచేసే అవకాశం ఇవ్వవచ్చని అంటున్నారు. గతంలో వైఎస్ హయాంలో దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో వీరిద్దరూ వైసీపీ లోకి రావడం వల్ల జగన్ కి చాలా లాభం జరుగుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


Advertisement


Advertisement

Top